కెప్టెన్ రేవంత్ పంతం.. హౌస్మేట్స్ బలి!
on Nov 23, 2022
ఆకలి బాధతో హౌస్‌లోని కంటెస్టెంట్స్ రోజు రోజుకి ఇబ్బంది పడుతున్నారు. కారణం రేవంత్ కెప్టెన్‌గా ఉండటమే అని కొందరు హౌస్మేట్స్ అనుకుంటున్నారు. కెప్టెన్‌గా ఉన్న ప్రతి ఒక్కరు ఫెయిల్ అయ్యారా? సక్సెస్ అయ్యారా?.. అనే దాని గురించి నాగార్జున ప్రశ్నిస్తూ ఉంటాడు. కాగా హౌస్‌లో రెండోసారి కెప్టెన్ అయిన రేవంత్ హౌస్ మేట్స్‌కు కఠిన నియమాలు పెట్టడం చూస్తూనే ఉన్నాం. కానీ ఆ నియమాలు పెట్టడం వల్ల హౌస్‌మేట్స్‌కి ఆకలి బాధతో కడుపు మండుతోంది.
ఇదే విషయం గురించి కీర్తి, ఇనయా మాట్లాడుకున్నారు. అయితే ఫైమా తన బాధను చెప్పుకొచ్చింది. "హౌస్‌లో అందరికి సరిపోయేంత అన్నం పెట్టకుంటే ఎలా? రేవంత్ అన్న.. ఒక్క నీ కెప్టెన్సీ లోనే ఇలా అవుతోంది" అని అంది. "నా ఇష్టం.. నేను ఇలాగే చేస్తాను" అని పంతం చూపించాడు రేవంత్. ఆ తర్వాత శ్రీహాన్ కూడా రేవంత్‌ని ప్రశ్నించాడు. "నీ కెప్టెన్సీలో రేషన్ మిగిలితే, నాగార్జున సర్ మెచ్చుకోవాలని అందరికి సగం సగం పెట్టి.. వాళ్ళ కడుపు నిండకుండా చేస్తున్నావ్. వారం మొత్తం సగం సగం అన్నం పెట్టి చివర్లో మిగిలినవి కదా అని ఎక్కువ పెడితే ఎలా! అందరి గురించి ఆలోచించాలి కదా రేవంత్" అని వాదించాడు. దానికి రేవంత్, "రేయ్.. ఆ ఒక్క దాన్ని పట్టుకొని ఇలా అనకు" అన్నాడు.
"రేవంత్.. మీరు పాల పాకెట్స్ ఇవ్వండి" అని ఇనయా అడిగింది. దానికి రేవంత్, "అందరికి కప్పుల వారీగా ఇస్తాను. ఇప్పుడు లేవు, సాయంత్రం ఇస్తాను" అని చెప్పాడు. "అంతా మీ ఇష్టమేనా రేవంత్" అని ఇనయా అనడంతో, రేవంత్ విసుక్కున్నాడు. "ఎవరు ఏమైనా అనుకోండి, నేను ఇలాగే ఉంటాను" అన్నాడు రేవంత్.
మిగతా హౌస్ మేట్స్ అందరు కూడా రేవంత్‌పై కోపంగా ఉంటున్నారు. అయితే హౌస్ మేట్స్ ఎదుర్కుంటున్న ఈ సమస్యను ఎవరూ గట్టిగా బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు. నాగార్జున మెప్పు కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. అయితే రేవంత్ కెప్టెన్సీలో హౌస్మేట్స్ పడుతున్న ఇబ్బంది గురించి వీకెండ్లో నాగార్జున అడుగుతాడో, లేదో.. చూడాలి మరి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
